Header Banner

ఇళ్ల పట్టాల పంపిణీలో వైసీపీ భారీ స్కామ్! వేల కోట్లు పార్టీ నేతల జేబుల్లోకి.. మంత్రి తీవ్ర ఆరోపణలు!

  Mon Mar 03, 2025 14:43        Politics

ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతురావు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad) సమాధానమిచ్చారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలను అందజేస్తామని స్పస్టం చేశారు. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70,232 దరఖాస్తులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇస్తోందని తెలిపారు.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


అంతేకాక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తోందన్నారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధనవంతులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, అనుయాయులకు ఇళ్ల పట్టాలు పంచి పెట్టారని మండలిలో వెల్లడించారు. ఇళ్ల పట్టాల కోసం భూముల కోనుగోలులోనూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి చెప్పారు.


ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


నివాసయోగ్యం కాని భూములను, స్మశానాలు, డంపింగ్ యార్డులు పక్కనున్న భూములను, వర్షం వస్తే మునిగిపోయే భూములను రెండింతలు, మూడింతలు అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించారని దుయ్యబట్టారు. మొత్తం 10,500 కోట్ల రూపాయలతో 26 వేల ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారని.. ఇందులో నుండి వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే అందరికీ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #landmafiya #todaynews #flashnews #latestnews